రాష్ట ప్రతిష్టను పెంచిన గిరిజన గురుకుల విద్యార్థులు

– నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో 230 పతకాలు సాధించిన తెలంగాణ
– విద్యార్థులను సన్మానించిన గిరిజన శాఖ మంత్రి అడ్లూరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: రూర్కెలా-సుందర్గఢలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల మధ్య జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌, ఓవరాల్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌, ఓవరాల్‌ ఇండివిడ్యువల్‌ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుని ఘనవిజయం సాధించింది. తెలంగాణలోని 23 ఈఎంఆర్‌ఎస్‌ సంస్థల నుండి 580మంది విద్యార్థులు, 68మంది ఎస్కార్ట్‌ టీచర్లు పాల్గొన్నారు. షూటింగ్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌, జూడో, స్విమ్మింగ్‌, తైక్వాండో, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, యోగా, బాస్కెట్‌బాల్‌, ఖో-ఖో తదితర విభాగాల్లో విశేష ప్రతిభను చాటి మొత్తం 230 పతకాలు సాధించి రాష్ట ఘనతను చాటారు. ఈ విజయం సాధించిన తెలంగాణ ఈఎంఆర్‌ఎస్‌ విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ%ౌహైదరాబాద్‌, ప్రల్ణజాతంత్ర, నవంబర్‌ 20: రూర్కెలాలో జరిగిన క్రీడా పోటీల్లో తెలంగాణ %జువీRూ% విద్యార్థులు సాధించిన 230 పతకాలు గిరిజన యువత ప్రతిభకు జాతీయస్థాయి గుర్తింపు’’ అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమలు చేస్తున్న నూతన క్రీడా విధానం, ఈఎంఆర్‌ఎస్‌లలో ప్రపంచ స్థాయి క్రీడా వాతావరణం సృష్టించడంలో ఒక గొప్ప పాత్ర పోషించిందని చెప్పారు. ఆయా విభాగాల్లో విద్యార్థులు సాధించిన పతకాలు క్రమశిక్షణ, శ్రమ, పట్టుదలకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ఈఎంఆర్‌ఎస్‌ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ క్రీడా సదుపాయాలు, నైపుణ్యం, శిక్షణ అందిస్తున్నదనే దానికి ఈ విజయం నిదర్శనమన్నారు. విద్యార్థుల విజయాల్లో కోచ్‌లు, టీచర్లు, అధికారులు, తల్లిదండ్రుల కృషి అమూల్యమని మంత్రి అభినందించారు. ప్రతి విద్యార్థి రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా క్రీడాకారులకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని జాతీయ-అంతర్జాతీయ పతకాలకు నాంది పలుకుతాయనీ, గిరిజన విద్యార్థుల క్రీడా ప్రతిభకు సహకరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ కె.సీతాలక్ష్మి, ఈఎంఆర్‌ఎస్‌ అధికారులు, కోచ్‌లు, టీచర్లు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *