– మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: గిరిజన తండాలకు రోడ్ల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మొన్నటి వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, అక్కడ రోడ్లు వేసేందుకు జీవో 240 ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. 429 గిరిజన ఆవాసాలకు రూ. 700 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఐటీడీఏ పరిధిలోని 236 హామ్లెట్ గ్రామాల రోడ్లకు ఎస్‌టీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని అనా్నరు. రాష్ట్రంలో పదేళ్లపాటు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను పట్టించుకోలేదని విమర్శించారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





