హైదరాబాద్,సెప్టెంబర్ 27(ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్ జీవోపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున వర్చువల్‌గా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెక్షన్ 286 కింద 50శాతం మించరాదని పిటిషనర్స్ వాదించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని న్యాయవాది మయూర్ రెడ్డి గుర్తు చేశారు. కాగా, అసెంబ్లీలో బీసీ బిల్ కోసం తీర్మానం చేశామని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానం ఫైనల్ చేసిందని, అసెంబ్లీకి ఆ అధికారం ఉందని ఏజీ ఉద్ఘాటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి అవసరం లేదని ఏజీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏజీకి 15 నిమిషాలు సమయం ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. అక్టోబర్ 8వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ప్రకారం కేసు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




