కడియం, సంజయ్‌లపై విచారణ 16కు వాయిదా

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర, మార్చి26 : పార్టీ మారలేదని పేర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కడియం శ్రీహరి, సంజయ్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కెపి వివేకానంద స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని కడియం శ్రీహరి, సంజయ్‌లను కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా కోర్టు విచారణపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *