కేసీఆర్‌ రాకతో సర్కార్‌లో వణుకు

– అర్ధరాత్రి వరకు విూటింగ్‌లు.. సవిూక్షలు
– వాస్తు భయంతో సీఎం సచివాలయానికి రావట్లేదు
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: కేసీఆర్‌ విూడియా ముందుకు వచ్చిన తర్వాత రేవంత్‌ సర్కార్‌ డిఫెన్స్‌లో పడిరదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తాను పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి చిట్‌చాట్‌ పెట్టడం చూడలేదన్నారు. ఆయన అందాల పోటీలు, ఫుట్‌బాల్‌ షోకులు, గ్లోబల్‌ సమ్మిట్‌ల గురించి మాట్లాడారంటూ అవి అన్నం పెడతాయా అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు వాస్తు భయం పట్టుకుందని, అందుకే సచివాలయానికి పోవటంలేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాలుగు వేల మంది సర్పంచ్‌లుగా గెలిచారని, బీఆర్‌ఎస్‌ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదని, కాంగ్రెస్‌ కార్యకర్తలను నామినేట్‌ చేయాలని చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి పోలీసులు లేకుండా ఓయూకు వస్తానని చెప్పారని, కానీ పోలీస్‌ పహారా మధ్య వచ్చారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్‌పై పీపీటీని స్వాగతిస్తున్నామని, దీనిపై అసెంబ్లీలో తమకూ తగినంత సమయం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కడం, మైక్‌ కట్‌ చేయడం లాంటివి చేయవద్దన్నారు. ఎవరి వాదన నిజమో ప్రజలు తేలుస్తారని చెప్పారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్‌ఎస్‌కు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం బీఆర్‌ఎస్‌కు భయపడుతున్నదని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బట్టలు విప్పుతామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాలలోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు అని హరీశ్‌ అన్నారు. తనది ప్రజా ప్రభుత్వమని రేవంత్‌ చెప్పుకోవడం కాదని, చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నాడో బహిర్గతం చెయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ జీవోలు దాస్తూ డ్రామాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఆర్టీఐ సమాధానం ఆధారంగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో వేసిన పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌తో ఆ డ్రామాలు బయటపడబోతున్నాయన్నారు. 2023 డిసెంబర్‌ 7 నుంచి 2025 జనవరి 1 వరకు 13 నెలల్లో ప్రభుత్వం 19,064 జీవోలు జారీ చేసిందని, వాటిలో 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచిపెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని హరీశ్‌రావు నిలదీశారు. ’రేవంత్‌ రెడ్డీ.. ఇదేనా విూరు చెప్పుకుంటున్న ప్రజా ప్రభుత్వం అని ప్రశ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *