ఓటరు జాబితాల్లో పారదర్శకత పాటించాలి

– రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
– నాలుగు జిల్లాల ఈఆర్వోలకు శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఎన్నికల జాబితాల ఖచ్చితత్వాన్ని కాపాడడం ఈఆర్వోల కీలక బాధ్యత అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాల్లో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈమేరకు నాలుగు జిల్లాలకు చెందిన ఎన్నికల నమోదు అధికారుల(ఈఆర్వోల)కు ముఖ్య ఎన్నికల అధికారి తన కార్యాలయంలో గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎసఐఆర్ అమలులో ఎదురయ్యే సవాళ్లు, పరిష్కారాలపై చర్చించి అధికారుల సందేహాలను నివృత్తి చేసే ఇంటరాక్టివ్ సెషన్లు కూడా నిర్వహించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ శిక్షణ నిర్వహించినట్లు సీఈవో తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 50మంది ఈఆర్వోలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఓటరు జాబితాల తయారీ, సవరణ, నిర్వహణ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటు త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎసఐఆర్)పై వివరంగా చర్చించారు. ఓటరు జాబితాల్లో ఖచ్చితత్వం, పారదర్శకత, సమగ్రతను పాటించేందుకు ఫీల్డ్‌స్థాయి అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన, చట్టపరమైన నిబంధనలు, సమయపట్టికల అమలు, సాంకేతికత వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *