– సమస్యలపై వేగంగా చర్యలు తీసుకోవాలి
– వికసిత భారత్ లక్ష్య సాధనలో సర్వీస్ కమిషన్ల పాత్ర కీలకం
– పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైంది. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు. నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం అని రాష్ట్రపతి అన్నారు. నియామకాల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంపై దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అలాగే నియామకాల్లో పారదర్శకత, నైతికత అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాలు నేర్పవచ్చని కానీ సమగ్రత లోపాన్ని మాత్రం భర్తీ చేయలేమన్నారు. టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కొనేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కమిషన్ చైర్మన్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు.. ఈ సదస్సుకు హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులు, పరస్పర సహకారంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సదస్సుకు హాజరైన రాష్ట్రపతి ముర్ముకు రామోజీ ఫిలిం సిటీలో ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట తెలంగాణకు చెందిన పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మయూపీఎస్సీచైర్మన్ అజయ్‌కుమార్, యూపీఎస్సీ కార్యదర్శి శశి రంజన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సు శనివారంతో ముగియనుంది. ఈ సదస్సుకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. అంతకుముందు బొల్లారం రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ద్రౌపదీ ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క ఉన్నారు. దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. సదస్సు అనంతరం సాయంత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో వివిధ ప్రదేశాలను ద్రౌపదీ ముర్ము సందర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.