మెట్రో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

– 20మందికి నియామక పత్రాలు అందచేత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16:‌హైదరాబాద్‌ ‌మెట్రోలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులుగా నియమించింది.. ఈ క్రమంలో మెట్రో రైల్‌ ‌లిమిటెడ్‌ ‌సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌నియామక పత్రాలు అందజేశారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌డియాతో మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతికి, వారు ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారని.. ఈ నేపథ్యంలోనే వీరిని నియమించారని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామని ఉద్ఘాటించారు. వారు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పుకొచ్చారు. వీరు ఈ సమాజానికి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌లకు ఇచ్చిన హాలను సీఎం రేవంత్‌రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *