చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విజయం

నల్లగొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. ట్రాన్స్‌జెండర్ శ్వేత సుధాకర్ మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి బరిలో దిగారు. శ్వేత సుధాకర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. దాంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను కాదని ఓటర్లు శ్వేత సుధాకర్‌ను గెలిపించుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *