కూరగాయల సాగుపై 25న శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఫామింగ్ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ (ఆదివారం) ఉదయ 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు రూ.100/` ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రంలో గాని లేదా 8977714411/8688848714 నెంబర్‌లలోగానీ సంప్రదించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *