– మీడియా అకాడమీ ఆధ్వర్యంలో భూ హక్కులు, వ్యవసాయంపై..
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: భూ హక్కులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, పర్యావరణ రిపోర్టింగ్‌పై ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు నాంపల్లిలోని అకాడమి ఆడిటోరియంలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. భూ చట్టాలు- భూ సమస్యల పరిష్కారం, వ్యవసాయం-అనుబంధ రంగాలలో ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు, పర్యావరణ భద్రత, చెరువులను కాపాడుకోవడం, జర్నలిస్టుల నైతిక నియమావళి, మీడియా-చట్టాలు, డిజిటల్ రిపోర్టింగ్, వ్యవసాయం, రైతు సమస్యలు, గ్రామీణ ప్రాంతాలు, రెవెన్యూ అంశాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించడంతోపాటు రిపోర్టింగ్‌లో పర్యావరణ, సాంకేతిక అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిపుణులు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. మీడియా రంగం వేగంగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని, సమాజానికి నిష్పక్షపాత, బాధ్యతాయుతమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని కార్యదర్శి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


