వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వికలాంగుల వృత్తి శిక్షణ, పునరావాస కేంద్రాన్ని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ మంగళవారం సందర్శించింది. వికలాంగులకు జీవనోపాధి కోసం నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ఈ కేంద్రం వృత్తి శిక్షణను, విద్యావేత్తలకు ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కోర్సులను కూడా అందిస్తున్నది. పాఠశాల నిర్వహిస్తున్న తీరును, విద్యాబోధన గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. వారు మానసిక వికలాంగ పిల్లలకు బోధిస్తున్న తీరును అభినందించారు. అలాగే అక్కడి పిల్లలను చదువు గురించి, ఇతర అంశాల గురించి కమిషన్‌ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతాదయాకర్‌ రెడ్డి, కమిషన్‌ సభ్యులు వచన్‌ కుమార్‌, వందన గౌడ్‌, చందన, అపర్ణ, సరిత, ప్రేమలత అగర్వాల్‌, ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపాల్‌, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదిలావుండగా పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపడానికి మధురానగర్‌లోని సంకల్ప ఫౌండేషన్‌(ఫౌండేషన్‌ డైరెక్టర్‌ రోజీ) ఆధ్వర్యంలో పిల్లలపై ఓటీటీి, సోషల్‌ మీడియా ప్రభావం అనే అంశాలపై పోస్టర్‌ను సీతాదయాకర్‌ రెడ్డి, కమిషన్‌ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్‌ సభ్యలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులకు ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్‌ పాఠశాలల నుండి త్రిమూర్తులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *