– న్యాక్ వైస్ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3ః నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ), ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్లు న్యాక్ వైస్ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న రాష్ట్రంలోని గ్రామీణ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అంతేకాక వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఇంజనీరింగ్ యువతకు ఫినిషింగ్ స్కూల్, ఎంఈపీ టెక్నీషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కల్పించనున్నట్లు కూడా తెలిపారు.
శిక్షణ వివరాలు :
శిక్షణ కాలం మూడు నెలలు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పన. శిక్షణకు కావలసిన కోర్స్ మెటీరియల్ బుక్స్, పెన్స్, స్టేషనరీ , యూనిఫామ్, షూస్, హెల్మెట్ కూడా ఉచితంగా ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాక్ సర్టిఫికెట్ఆ, కర్షణీయమైన జీతంతో కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పన.
కోర్సుల వివరములు :
కోర్సు పేరు వ్యవధి అర్హత
1. ల్యాండ్ సర్వేయర్ 3 నెలలు ఇంటర్/ఐటీఐ/డిప్లొమా
2. సూపర్వైజర్ స్ట్రక్చర్ 3 నెలలు ఇంటర్/ఐటీఐ/డిప్లొమా
3. జూనియర్ స్టోర్ కీపర్ 3 నెలలు ఏదైనా డిగ్రీ
4 . ఫినిషింగ్ స్కూల్
(ఉచిత శిక్షణ మాత్రమే) 3 నెలలు బీటెక్/బీఈ సివిల్
5. ఎంఈపీటెక్నీషియన్
(ఉచిత శిక్షణ మాత్రమే) 45 రోజులు డిప్లొమా/ బీటెక్ / బీఈ (ఈఈఈ/మెకానిక్/సివిల్)
ఆసక్తిగల రాష్ట్ర నిరుద్యోగ యువత న్యాక్ హైదరాబాద్ క్యాంపస్ నందు నిర్వహించు శిక్షణకు హాజరయ్యేందుకు ఈ క్రింది తెలిపిన వివరాలతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, ఇజ్జత్ నగర్, కొత్తగూడ పోస్టు, హైదరాబాద్- 500084. సెల్ నంబరు 8008937800, 8328622455, 7097114947లో సంప్రదించాలని తెలిపారు.
కావాల్సిన పత్రములు:
ఆధార కార్డ్ 2. రేషన్ కార్డ్ 3.అర్హత పత్రాలు ((విద్యా సంబంధ సర్టిఫికెట్లు. 4. కులం సర్టిఫికెట్ 5. ఆదాయం సర్టిఫికెట్ 6.పాస్ ఫోటోస్ 5. అడ్మిషన్ చివరి తేదీ జనవరి 15. అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు. లేదా www.nac.edu.in వెబ్ సైటులో రిజిస్టర్ చేసుకోవాలని మంత్రి వెంకట్ రెడ్డి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



