మెదక్‌ ‌జిల్లాలో దారుణ ఘటన

– ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య

మెదక్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: మెదక్‌ ‌జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్‌ ‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను, భార్య‌ హత్య చేసిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. ఇక, పోలీసుల విచారణలో భార్య మౌనిక(28) అక్రమ సంబంధం బాగోతం బయటపడింది. అయితే, 12 ఏళ్ల క్రితం స్వామి, మౌనికలకు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకంటే తక్కువ వయస్సున్న సంపత్‌ (23) తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో పంచాయితీ పెడతానని భర్త హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా భర్తను చంపేయాలని మౌనిక ప్లాన్‌ ‌వేసింది. గత నెల డిసెంబర్‌ 22‌వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రపోయిన స్వామి.. ఇదే అదనుగా భావించి ప్రియుడిని ఇంటికి పిలిచి ఇద్దరు కలిసి భర్త గొంతు నొక్కి చంపేశారు. ఇక, భర్త స్వామి చనిపోయిన తర్వాత బైక్‌ ‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి నెరేళ్లకుంటలో పడేసి మద్యం మత్తులో పడి చనిపోయినట్టు కిలేడి మౌనిక నమ్మించింది. అయితే  ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో తమ స్టైల్లో పోలీసులు విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో మౌనికతోపాటు ఆమె ప్రియుడు సంపత్‌ను  పోలీసులు అరెస్ట్ ‌చేసి రిమాండ్‌ ‌కి తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *