మేడారంలో తీవ్ర విషాదం

– రాతి కట్టడం కూలి బాలుడికి గాయాలు
– హాస్పిటల్‌ ‌కు తీసుకెళ్లగా కాలు తీసేసిన వైద్యులు

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. మేడారం పూజారి సిద్ధబోయిన రమేశ్‌ ‌కుమార్‌ ‌కొడుకు యువన్‌పై ఒక్కసారిగా రాతి కట్టడం కూలి పడటంతో ఈ దారుణం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని హాస్పిటల్‌కి తరలించారు. బాలుడు యువన్‌ ఆడుకుంటున్న సమయంలో సమీపంలోని ఒక రాతి కట్టడం ఒక్కసారిగా అతడిపై పడింది. ఈ ప్రమాదంలో బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్‌కి తరలించ‌గా వైద్యులు కాలు తొలగించారు. గాయం తీవ్రంగా ఉండటంతో ఇన్ఫెక్షన్‌ ‌సోకకుండా ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. తమ కళ్ల ముందు ఆడుకోవాల్సిన బిడ్డ ఇలా కాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హాస్పిటల్‌ ‌ప్రాంగణంలో వారి ఆవేదన చూసి స్థానికులు సైతం చలించిపోయారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *