– 18 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
– చలిలో చిన్నారులు, వృద్ధుల అవస్థలు
– తాగడానికి నీరు, తినడానికి తిండి లేక విలవిల
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 31: సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒకవైపు గద్దెల వద్ద ఉద్రిక్తతలు, మరోవైపు కిలోమీటర్ల మేర సాగుతున్న ట్రాఫిక్ జామ్తో భక్తులు నరకప్రా యమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గోవిందరావుపేట నుండి పస్రా వరకు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలి చిపోయాయి.డబుల్ రోడ్డు ఉన్నా తప్పని తిప్ప లుగోవిందరావుపేట పస్రా మార్గం డబుల్ రోడ్డు అయినప్పటికీ, క్రమశిక్షణ లేని వాహన చోదకులు మూడు వరుసల్లో వాహనాలను ముందుకు పోనివ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ వాహనాలను క్రమబద్ధీకరిం చడంలో ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనాలు ఇంచు కూడా కదలలేని స్థితిలో లక్షలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. ఆకలి దప్పులతో అల్లాడుతున్న చిన్నారులు, కనీస అ వృద్ధులు ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులకు కనీస అవసరాలు తీరలేదు. మంచినీరు కూడా కరువైంది. గంటల తరబడి ఎండలో, చలిలోవాహనాల్లోనే ఉన్న భక్తులకు తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు.


ఆహారం అందక అవస్థలు
అటవీ మార్గంలో ఎక్కడా ఆహార సౌకర్యాలు లేకపోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఆకలితో విలవిలలాడుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన: సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రద్దీలో ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు.
కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం శూన్యం
మేడారం జాతర కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించినా క్షేత్ర స్థాయిలో భక్తుల రద్దీకి తగినట్లుగా మౌలిక వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాహనాల సంఖ్య విపరీతంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





