– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వనదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. దీంతో జాతరకు వెళ్లే ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తాడ్వాయి–మేడారం రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో భక్తులు గంటల తరబడి ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితితో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్‌ను కదిలించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత
జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 25 మంది ఐపీఎస్ అధికారులు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఈ నెల 28న వైభవంగా ప్రారంభమైన మేడారం మహాజాతర 31వ తేదీన వనప్రవేశంతో ముగియనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





