ముగుస్తున్న సంక్రాంతి సెలవులు

– తిరుగు పయనంలో ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా వాహనాల మళ్లింపు
– నల్గొండ పోలీసుల ముందస్తు చర్యలు

నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి16: సంక్రాంతి సంబురాల ముగింపుతో పల్లెలకు వెళ్లిన వారు నగరానికి చేరే సమయం ఆసన్నమైంది. శని, ఆదివారాల్లో నగరాలకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో రోడ్లు జామ్‌ కాకుండా, ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ ` విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాహన మళ్లింపులు చేపట్టారు. చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైవోవర్‌ నిర్మాణం జరుగుతుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశం ఉన్నందున దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్‌ విూదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు. మాచర్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను నాగార్జునసాగర్‌, పెద్దవూర, కొండపల్లేపల్లి, చింతపల్లి`మాల్‌ విూదుగా హైదరాబాద్‌ మళ్లిస్తారు. నల్లగొండ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను నల్లగొండ,మర్రిగూడ బైపాస్‌ `మునుగోడు, నారాయణపూర్‌` చౌటుప్పల్‌ (ఎన్‌.హెచ్‌ 65)విూదుగా హైదరాబాద్‌ తరలిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలను కోదాడ-హుజూర్‌నగర్‌`మిర్యాలగూడ` హాలియా`చింతపల్లి` మాల్‌ విూదుగా హైదరాబాద్‌ మళ్లిస్తారు. ఎన్‌.హెచ్‌ 65 విజయవాడ `హైదరాబాద్‌ రహదారిపై చిట్యాల- పెద్దకాపర్తిలో ప్లైఓవర్‌ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్‌ జామ్‌ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి గుండా హైద్రాబాద్‌ మళ్లించడం జరుగుతుంది. ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల విజయవాడ- హైద్రాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *