– భారీ వర్షలతో పలుచోట్ల కొట్టుకుపోయిన రోడ్లు
– వాహనాలను దారి మల్లించినట్లు ట్రాఫిక్ డీసీపీ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 28: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల 44వ నంబర్ జాతీయ రహదారి దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి ఎన్‌హెచ్ 44 వైపు వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలను మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ చెక్‌పోస్ట్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్ దుగా ఆదిలాబాద్ వెళ్లాలని గజరావ్ భూపాల్ సూచించారు. పోలీసులకు ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు. దూరప్రాంతాలకు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మళ్లింపు మార్గాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ప్రయాణికులకు సహాయం కోసం ట్రాఫిక్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ బృందాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భారీ వర్షాలతో కామారెడ్డి సపంలో 44వ జాతీయ రహదారి ధ్వంసమైందని.. దీంతో 25 శాతం రాకపోకలు మాత్రమే జరుగుతున్నట్లు ఆ జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు మేడ్చల్-రామాయంపేట్-కామారెడ్డి-డిచ్‌పల్లి మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ దారుల్లో రాకపోకలు సాగించాలని సూచించారు. భారీ వాహనాలను మేడ్చల్ వద్ద.. సాధారణ వాహనాలను రామాయంపేట వద్ద మళ్లిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి దుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ సపంలోని కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపునకు తిరిగి డైవర్షన్ మార్చుకుని వెళ్లాలని సూచించారు. కొండాపూర్ నుంచి మామడ, ఖానాపూర్‌మెట్, జగిత్యాల, కరీంనగర్ దుగా హైదరాబాద్ వెళ్లాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



