– నలుగురు మహిళా కూలీల దుర్మరణం
జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 3 జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ కూలీలు పసుపుకోతకు వెళ్లి తమ పనిని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పసుపు లోడుతో ఉన్న ట్రాక్టర్లో ఎక్కారు. మార్గమధ్యలో మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి నీటి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్లో సుమారు 8 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





