– కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టుల అక్రమ అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఖండించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధవాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. పోలీసుల చర్యలను ఖండిస్తున్నా.. తలుపులు బద్దలుగొట్టి దౌర్జన్యంగా బద్దలుగొట్టి ఇంట్లోకి వచ్చారు. పండగకు భార్యతో వెళ్తుండగా ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్‌ను లాక్కెళ్లడం సరికాదు. ప్రొసీజర్, నోటీసులు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.