నిజామాబాద్‌లో అత్యధిక సర్పంచ్‌ల గెలుపు

– రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
– కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చే జీ.ఓలు పారదర్శకం
– ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి విజినరీ నేత
– టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమర్‌ ‌గౌడ్‌

‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌రాష్ట్రంలో అత్యధిక కాంగ్రెస్‌ ‌సర్పంచ్‌లు నిజామాబాద్‌ ‌జిల్లాలోనే గెలుపొందారని.. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చే జీ.ఓ.లు పారదర్శకంగా ఉంటాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఒక్క జీ.ఓ.ను కూడా బహిర్గతం చేయలేదన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒక విజన్‌ ఉన్న నాయకుడని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమర్‌ ‌గౌడ్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో రూ.1.70 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు ఒప్పందం కుదరడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రజా ప్రభుత్వం పాలనలో పదేళ్ల విధ్వంసం నుంచి వికాసం దిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌ ‌నోరు జారి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని మందలించారు. ఆయనలా దిగజారి తాము మాట్లాడమని చెప్పుకొచ్చారు. ప్రజలే కేసీఆర్‌ అం‌డ్‌ ‌కోకు బుద్ధి చెబుతారని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌నాయకులు విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా తాము దుర్వినియోగం చేయట్లేదన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులకు అవసరమైన విద్యుత్తు అందించేందుకు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన నీరు అందించాలంటే విద్యుత్తు ఎంతో అవసరమని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఫామ్‌హౌస్‌లో కూర్చున్న కేసీఆర్‌ ‌బయటకు వచ్చి విమర్శిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత నేడు మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని సవాల్‌ ‌విసిరారు. వొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తాము సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, బీమా పథకం అమలు చేస్తున్నామని మహేశ్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *