బిఆర్‌ఎస్‌ అదృశ్యం ఖాయం

– రాజకీయ ముఖచిత్రంలో ఇక మాయం
– పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌వ్యాఖ్యలు

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్25:‌రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్‌ అనే పార్టీ  ఉండదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ అన్నారు. కరీంనగర్‌  ‌కార్యకర్తల టింగ్‌ ‌లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి తర్వాత ముందు   కుటుంబ ఆస్తుల పంచాయితీ  తేల్చుకోవాలని కేటీఆర్‌ ‌పై  సెటైర్‌ ‌వేశారు.  లక్షా 20 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ‌వాళ్లను  దోషులుగా తేలిస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించారు కానీ ప్రజా క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు. గత పదేళ్లలో తెలంగాణలో శాంపిల్‌ ‌సర్కార్‌ ‌నడిపించారని ఫైర్‌ అయ్యారు. సమావేశంలో మాట్లాడిన మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌.. ‌జనహిత పాదయాత్ర వల్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌కు కడుపు నొప్పి వస్తుంది.  కార్యకర్త త్యాగ ఫలితంగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టాం. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలను వొదిలిపెట్టుకోబోమన్నారు.  పేదవారి జీవిత కాల స్వప్నమైన ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నాం. పథకాలు రాని 10 శాతం వారే ఇబ్బంది పెడుతున్నారు .దీనిపై  కార్యకర్తలు  దృష్టి పెట్టాలి.  బండి సంజయ్‌ ‌వ్యాఖ్యల వల్లే బీసీ బిల్లు పెండింగ్‌ ‌లో ఉంది.  దేవుడి పేరు చెప్పకుండా బండి సంజయ్‌ ‌మళ్ళీ గెలుస్తారా అని ప్రశ్నించారు. .అంబానీ, అదానీలకు కేంద్ర ప్రభుత్వం దోచి పెడుతుంది. క్రూడ్‌ ఆయిల్‌ ‌ధరలు తగ్గినా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఎందుకు తగ్గలేదు.  12 ఏళ్లలో రాష్టాన్రికి బీజేపీ ఏం చేసింది.? రాష్ట్రంలో జరిగిందంతా కాంగ్రెస్‌ ‌హయంలోనే జరిగింది. 42 బీసీ రిజర్వేషన్స్ ‌లో ముస్లింలకు 5.8 శాతం మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే 4 శాతం ఉంది. అయినా బీజేపీ 10 శాతం అని తప్పుడు ప్రచారం చేస్తోంది.  బీజేపీ ఎంపీల వల్ల బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  అన్నారు .కరీంనగర్‌ ‌బిజెపి ఎంపిలు దొంగ ఓట్లతో గెలిచారని టిపిసిసి ఛీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  ‌తెలిపారు. దొంగ వోట్లతో గెలిచినట్టు తమ దగ్గర ఆధారాలున్నాయని అన్నారు.  మహేష్‌ ‌డియాతో మాట్లాడుతూ..బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌కి మెజారిటీ ఎలా వస్తుంది? అని ఒకే డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌ట్లో 69 వోట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. బండి సంజయ్‌ అసలు బిసినే కాదని ఆయన దేశ్‌ ‌ముఖ్‌ అని తెలియజేశారు. తెలంగాణలో వోట్ల చోరిపై ఈసీని కలుస్తామని అన్నారు. ఎన్నికల సంఘం ఇలా ఉండటం మన దౌర్భాగ్యం అని ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ ఎం‌పి అర్వింద్‌ ‌గెలుపుపై కూడా అనుమానం ఉందని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు. కొత్తగా కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు  ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్‌ ‌ఛార్జ్ ‌నాక్షి నటరాజన్‌ అన్నారు.   కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయి కానీ పాత వారికి ముందు అవకాశం  వస్తుందన్నారు.  కరీంనగర్‌ ‌లో కార్యకర్తల టింగ్లో మాట్లాడిన నాక్షి నటరాజన్‌.. ‌వోట్‌ ‌చోరీ నీ ఆపాలంటే వోటర్‌ ‌లిస్ట్ ‌పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఎన్నికల సంఘం బీజేపీకి ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ ‌గా పని చేస్తోందని ఆరోపించారు నాక్షి నటరాజన్‌.  ‌కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే అందరితో మాట్లాడామని చెప్పారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *