మంత్రి జూపల్లిని కలిసిన పర్యాటక శాఖ ఎండి గౌతమి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: పర్యాటక, సాంస్క తిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.గౌతమిలు డాక్ట‌ర్‌ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, నూతన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *