– కేంద్ర మంత్రి షెకావత్‌కు మంత్రి సీతక్క వినతి
దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాలో (Mulugu District) పర్యాటక అభివృద్దికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్(Gajendrasing Shekavat) కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. దిల్లీలో బుధవారం ఆయనను కలిసి ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. ఈ సందర్భÛగా ఆయనకు జ్ఞాపికను అందజేసి పలు అంశాలపై విన్నపాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం రూ.25 కోట్లను మంజూరు చేయాలని కోరారు. అలాగే మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ది కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి షేకావత్‌కు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.



