– ఆకాశంలో కనిపించనున్న బ్లడ్‌మూన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి2 : సంపూర్ణ చంద్రగ్రహణంతో మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ’బ్లడ్‌మూ న్’ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుండగా దీని ప్రభావం 4.34 గంటల నుంచి మొదలవనుంది. దీన్ని చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి ఉండాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే బ్లడ్‌మూన్ ఉంటుంది. గ్రహణం ముగిసే ఘట్టాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్రాలకు ఉండనుంది. చంద్రునిపై భూమి నీడ దాదాపు ఒక గంట రెండు నిమిషాలపాటు పడనుంది. అయితే చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాలపాటు బ్లడ్‌మూన్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. దిల్లీ ప్రజలు 20 నిమిషాలకుపైగా గ్రహణాన్ని వీక్షించనున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవి. ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువసేపు ఉంటుంది. ఇటానగర్, గువహటి, సిలిగురి, కోల్‌కతా వంటి నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా, ఎక్కువ సమయం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
నేడు యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి 2: సంపూర్ణ చందగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. చందగ్రహణం కారణంగా ప్రధానాలయంతోపాటు ఉప ఆలయాలు, అనుబంధ దేవాలయాలలో ఉదయం 7 గంటలలోపు సుప్రభాత, నిజాభిషేకం, అర్చనలు ముగించి మూసివేస్తామని వెల్లడించారు. 4వ తేదీ ఉదయం 3 నుంచి 5.30 గంటల వరకు ప్రధానాలయంతోపాటు ఉప ఆలయాలను తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం సుప్రభాతం, తిరువారాధన, బాలభోగం, ఆరగింపు, నిజాభిషేకం నిర్వహించి 8.45 గంటలకు ఉభయ దర్శనాలను ప్రారంభిస్తామన్నారు. చందగ్రహణం సందర్భంగా స్వామివారి సన్నిధిలో రేపు జరిగే హోలికోత్సవాన్ని సోమవారం నిర్వహించినట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





