రేపు రంజాన్‌ ‌పండుగ

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20:రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌) ‌పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రంజాన్‌ ‌పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ ‌మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్‌, ‌ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆకాంక్షించారు.

కేసీఆర్ శుభాకాంక్షలు   

రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్’ సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ గంగా-జమున తహజీబ్‌కు ప్రతీకగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని కేసీఆర్ అన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *