– చికిత్స పొందుతూ మరొకరు మృతి
న్యూదిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని దిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సాయంత్రం 7 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. మరో 20 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగతావారికి హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది.
ఎగరిపడ్డ చేయి గుర్తింపు.. ఛిద్రమైన దేహాల గుర్తింపులో ఫోరెన్సిక్ విభాగం
ఎర్రకోట వద్ద పేలుడు ఘటనాస్థలంలో భయానక దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ఆ పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దలు కొన్ని వందల టర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. తాజాగా లజపతిరాయ్ మార్కెట్‌లోని ఓ దుకాణంపై తెగిపడిన చేయిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎర్రకోట కారిడార్‌కు ఎదురుగా ఉన్న ఈ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి దాదాపు 300 టర్ల దూరంలో ఉంది. ఈ దుకాణం పైకప్పుపై మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని ఫోరెన్సిక్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షలతో ఈ శరీర భాగం మృతుల్లో ఎవరిదో గుర్తించనున్నారు.ఇక, ఈ పేలుడులో మృతిచెందిన వారి శరీరాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. చాలా మృతదేహాలపై బలంగా దెబ్బలు తగిలిన గాయాలున్నట్లు గుర్తించారు. పేలుడు తీవ్రతకు వారు ఎగిరి సపంలోని గోడకు లేదా నేలపై బలంగా పడిపోయి ఉంటారని ఫోరెన్సిక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక, మృతుల్లో చాలామందికి ఊపిరితిత్తులు, చెవులు, ఉదరభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఈ ఘటనకు హైగ్రేడ్ పేలుడు పదార్థాలను వినియోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిల్లో బుల్లెట్లు, రెండు వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఒకటి అమ్మోనియం నైట్రేట్‌ను పోలినట్లుగా ఉందన్నారు. రెండోది దీనికంటే శక్తిమంతమైనది అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఎరుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు స్వాధీనం.. నడిపిన ఫహీమ్ అరెస్ట్
దిల్లీ పేలుడు కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న డీఎల్10సీకే0458 అనే ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హర్యానాలోని ఖండవలి గ్రామంలో బుధవారం కనుగొన్నారు. అయితే ఆ కారును అక్కడ పార్క్ చేసిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతడిని ఫహీమ్‌గా గుర్తించారు. అతడిని విచారిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుతో సంబంధం ఉన్న మూడో కారు కోసం దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. సోమవారం సాయంత్రం తెలుపు రంగు హుందయ్ ఐ20 కారుతో డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రకుట్ర కోసం మూడు కార్లు వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును ఫరీదాబాద్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో కారు మారుతీ బ్రీజా కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆ కారు ఆచూకీ చిక్కడం లేదు. నిందితులు ఆ మూడో కారును తప్పించుకోవడం కోసం వాడాలని భావించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు ఆ కారు కోసం వేట కొనసాగిస్తున్నాయి. మారుతీ బ్రీజా కారును గుర్తించేందుకు దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంతో పాటు సప రాష్ట్రాల్లోనూ పోలీసులు వెతుకుతున్నారు.
పేలిన కారులో ఉన్నది ఉమర్ నబీయే
ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వొచ్చింది. బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ అని తేలింది. కారులో లభించిన నమూనాలతో అతని డీఎన్‌ఏ సరిపోలడంతో కారు నడిపింది నబీయేనని అధికారులు నిర్దారణకు వచ్చారు.గత సోమవారం దిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న అతను కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు అనుమానించారు. ఈ నేపథ్యంలో పుల్వామాలో ఉన్న అతని తల్లి నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారు స్టీరింగ్, యాక్సిలరేటర్ మధ్య ఇరుక్కున్న కాలు నుంచి సేకరించి డీఎన్‌ఏను ఆమె డీఎన్‌ఏతో సరిపోల్చారు. దీంతో కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదేనని తేలినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఏడాది జనవరిలో ఎర్ర కోట వద్ద డాక్టర్ ముజమ్మిల్ పలుసార్లు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోటపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఈ రెక్కీ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడ పటిష్టమైన పోలీసు పెట్రోలింగ్ ఉండడంతో వారి కుట్ర భగ్నమైందని చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న భారీ పేలుడుకు రెడ్ ఫోర్ట్ సపంలో పేలుడుకు గురైన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ కుట్ర పన్నినట్లు బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ జైషే మొహమ్మద్ ఉగ్ర మాడ్యుల్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై అరెస్టయిన 8 మందిని పోలీసులు ప్రశ్నించగా ఈ సంచలన వివరాలు వెల్లడైనట్లు ఆ వర్గాలు చెప్పాయి. దిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. ఫరీదాబాద్ పరిధిలోని ధౌజ్ గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ హర్యానా రాజధానికి కేవలం 30 కి. దూరంలోనే ఉంది. వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌కు, రాడికలైజ్డ్ నిపుణుల బృందం తలపెట్టిన ఒక మారణహోమానికి కేంద్ర బిందువుగా మారింది. పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు. డాక్టర్ ఉమర్ కాకుండా, ఉగ్ర దాడికి సహకరించారని అనుమానిస్తున్న, జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న అతని ఇద్దరు సహాయకులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిద్‌లు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. డాక్టర్ షకీల్‌ను అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉమర్ సోమవారం కారు బాంబు పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. డాక్టర్ షాహిన్ కారు నుంచి రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేశారు. పేలుడు అనంతరం మరో డాక్టర్ నిసర్-ఉల్-హసన్ పరారీలో ఉన్నాడు. హసన్ ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై ఆయనను శ్రీ మహరాజ హరి సింగ్ హాస్పిటల్ నుంచి జమ్ము కశ్మీర్ లెప్ట్‌నెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. అయితే ఇలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని ఈ యూనివర్సిటీలో ఎలా నియమించారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



