కల్లు బాధితుల ఆరోగ్యస్థితిపై మంత్రి దామోదర ఆరా

నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, జులై 11: నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యటనలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్‌, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి కల్తీకల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పేషెంట్ల పరిస్థితి గురించి డాక్టర్లు ఆయనకు వివరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 35మంది, గాంధీలో 18మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. నిమ్స్‌లో ఉన్న 35మందిలో ఐదుగురిని ఈరోజు పంపించేస్తున్నామని, మిగిలిన 30 మందికి చికిత్స కొనసాగిస్తున్నామని వివరించారు. గాంధీలో ఉన్న 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మిగిలిన 14 మంది పేషెంట్ల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పేషెంట్లందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను, డాక్టర్లను మంత్రి ఆదేశించారు. పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్స్‌లోనే ఉంచాలని, ఆ తర్వాతే పంపించాలన్నారు.

బాధితుల్లో కిడ్నీలు పనిచేయని వారు 9మంది

హైదరాబాద్‌: కల్తీకల్లు కారణంగా చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్‌ బులిటెన్‌ను నిమ్స్‌ వైద్యులు విడుదల చేశారు. వారిలో కిడ్నీ బాధితులు సంఖ్య పెరుగుతోందని, కిడ్నీ పనిచేయని వారి సంఖ్య 9కి చేరిందని పేర్కొనారు. మరో ఇద్దరు బాధితులకు కూడా డయాలసిస్‌ చేయాల్సి పరిస్థితి ఉన్నట్లు వెల్లడిరచారు. చికిత్స పొందుతున్న వారిలో 11మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యలు వెల్లడిరచారు. మరో 12 మందిని పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నామని బులిటెన్‌ల్లో పేర్కొన్నారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *