– వనం నుండి జనంలోకి రానున్న సమ్మక్క
– కుంకుమ భరిణ రూపంలో మేడారం గద్దెలపైకి
– మూడంచెల భద్రత మధ్య ఆగమనం
– గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరపనున్న జిల్లా ఎస్పీ
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం మహా జాతరలో గురువారం సాయంత్రం మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. వనంలో ఉన్న చిలుకలగుట్ట నుంచి మూడంచెల భద్రత మధ్య రోప్ పోర్టీతో గద్దెల వద్దకు రానున్న సమ్మక్క. ఆ తల్లి దర్శనం ఎప్పుడెప్పుడా అని లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నారు. కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య మాల్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్‌లతో కలిసి సాయంత్రం చిలకగుట్ట నుంచి తీసుకురానున్నారు. ఇప్పటికే చిలకగుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు రోప్ పార్టీ ట్రయల్ రన్ పూర్తి అయింది. సమ్మక్క గద్దె వద్దకు చేరుకునే సమయంలో ఆమెకు స్వాగతం పలుకుతూ జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరపడం ఆనవాయితీ. బుధవారం రాత్రికే పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ ప్రతిరూపాలు గద్దెలపై కొలువుదీరాయి. ఇప్పటికే ఇసుక వేస్తే రాలనంతమంది భక్త జనం. ఎటు చూసినా భక్తులే. క్యూలైన్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. నేడు సమ్మక్క ఆగమనం నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. రద్దీని తట్టుకునేలా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్స్, అగ్నిమాపక, వైద్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





