విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ హక్కుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఆయా వర్గాల హక్కులను కాపాడేందుకు సంఘాలను నడిపిస్తున్న మిమ్ములను హృదయపూర్వరకంగా అభినందిస్తున్నానన్నారు. భవిష్యత్తులో మీ సంఘాలకు, ఉద్యోగస్తులకు ఎక్కడ, ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నదని చెప్పారు. ఉద్యోగులు, సంఘాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ తన అభిప్రాయాలను రుద్దలేదని, మీ అభిప్రాయాలను తెలుసుకుని ప్రజాస్వామ్యయుతంగా వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, అసొసియేన్ ఫౌండర్ సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్, వర్కింగ్ సెక్రటరీ పీఎం రాజు, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *