ఇండియా బ్లాక్ ఉప రాష్ట్రపతి అభ్యర్థి, న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి సన్మాన కార్యక్రమం బుధవారం పార్లమెంట్లో జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు INDIA బ్లాక్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ –“మా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజలకు న్యాయం, ప్రజాస్వామ్య రక్షణ అనే మా ఐక్య సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని పేర్కొన్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతం : రాహుల్ గాంధీ





