ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం

– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కొత్తగూడెం, ప్రజాతంత్ర, మార్చి 11: ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్‌ ‌మండల పరిధి నకిరిపేట పరిధిలోని దోమలవాగుకు సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరిపేట పరిధిలోని దోమలవాగు ఈ ప్రాంత రైతులకు జీవనాధారంగా ఉందని, దోమలవాగుకు రూ.186 కోట్లు వెచ్చించి త్వరలో మినీ రిజర్వాయర్‌ ‌చేస్తామని రైతులకు హా ఇచ్చారు. ప్రస్తుతం దోమలవాగు పరిధిలో 600 నుండి 800 ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో రైతులు పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నట్లయిందన్నారు. దోమలవాగు మినీ రిజర్వాయర్‌ అయితే 2 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రెండు పంటలకు డోకా ఉండదన్నారు. సాగునీరు సకాలంలో అందితే వరిసాగుతో పాటు ఆకుకూరలు, కూరగాయల సాగు కూడా చేపట్టవచ్చని తెలిపారు. అనంతరం నకిరిపేటలో మండల పరిషత్‌ ‌ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్ధులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర విషయాలపై ఆరా తీశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వారికి నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, సీతారామ ప్రాజెక్టు ఈఈ తెల్లం వెంకటేశ్వరరావు, ఏఈ గణెళిషానాయక్‌, ‌నకిరిపేట సర్పంచ్‌ ‌సర్పా నాగమణి, మాజీ సొసైటీ చైర్మన్‌ ‌పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్‌ ‌పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్‌ ‌గాంధీ, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీష్‌, ‌ప్రసాద్‌, ఇం‌గువ రమేష్‌, ‌బాదం రమేష్రెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *