ఆర్థిక మూలాలు పెంచేలా ప‌థ‌కాలు రూపొందించాలి

– పశు సంవర్ధక శాఖను అభివృద్ధి పరచాలి
– కొత్త ఆలోచనలతోనే శాఖలో మార్పులు
– బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేయండి
– అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించేలా నివేదికలు తయారు చేయండని మంత్రి సూచించారు. ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వ పథకాలను రూపొందించాలన్నారు. పశుసం వర్ధక శాఖకు సంబంధించి హర్యానా, తమిళ నాడు, గుజరాత్ రాష్ట్రాల మోడల్ను ఆద ర్శంగా తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో ఏం చేస్తే సక్సెస్ అవుతామో అధ్య యనం చేయాలన్నారు. ఆరోగ్యకరమైన తె లంగాణను నిర్మిస్తేనే భవిష్యత్ బాగుంటుందని, అందుకోసం స్వచ్ఛమైన పాలు, బలమైన పోషకాలు ఉన్న చికెన్, మటన్, చేపల ఉత్పత్తి చేయాలన్నారు. ఉన్నతాధికారులు, అధికారులు సమన్వయం చేసుకుంటూ బాధ్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఆర్ధిక స్వావలంబన లభించే పథకాలను రూపొందించి అమలుచేద్దాం అని అన్నారు. తెలంగాణకు ఆర్థిక మూలాలు పెంచేలా పశు సంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు దిశానిర్దేశ చేశారు. కొత్త ఆలోచనలతోనే పశుసంవర్ధక శాఖలో మార్పులు తీసుకురాగలమని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. పా డి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వివరించారు. బడ్జెట్లో నిధులు ఎన్ని కేటాయించారనేది కాకుండా ఎంతమేరకు ఖర్చు చేశామనే ఆలో చన చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూ చించారు. బ్జడెట్ లో అధిక నిధులు కేటాయిం చే లా నివేదికలు తయారు చేయాలని అధికారు లను మంత్రి ఆదేశించారు. ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వ పథకాలను రూపొందించాలని మంత్రి సూచించారు. పశుసంవర్ధక శాఖకు సంబం ధించి హర్యానా, తమిళనాడు, గుజరాత్ రా ష్టాల్ర మోడల్న ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం లో పథకా లను డిజైన్ చేయాలని తెలిపారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో ఏం చేస్తే సక్సెస్ అవుతామో అధ్యయనం చేయా ల్సిన అవసరముందన్నారు. ఆరోగ్యకరమైన తెలంగా ణను నిర్మిస్తేనే భవిష్యత్ బాగుంటుంద ని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకోసం స్వచ్ఛ మైన పాలు, బలమైన పోష కాలు ఉన్న చికెన్, మటన్, చేపల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగాలని మంత్రి శ్రీహరి అన్నారు.  పాడి రంగానికి సంబంధించి అన్ని అంశాలు బడెట్లో పొందుపరచాలని, పాల ఉత్పత్తి, అందుకావాల్సిన మౌలిక సదుపాయా లు, ఇతర అంశాలను పరి గణనలోకి తీసుకోవాలని మంత్రి శ్రీహరి అన్నారు. పాడి పరిశ్రమ బలోపేతం, సమన్వ యం కోసం ఐఏఎస్ స్థాయి అధికారిని నియ మించుకోవాలని, దానివల్ల పాల ఉత్పత్తిని పెం చుకోవొచ్చని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభా వం వ్యక్తం చేశారు. వెటర్నరీ సంస్థల్లో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలకు కూడా బడెట్లో ప్రాధాన్యత ఇవ్వా లని సూచించారు. షెడ్యూల్ ప్రకారం పశువులకు టీకాలు, ఔషధాల సరఫ రా జరిగేలా, దాని కి బడెట్లో కేటా యింపులు ఉండాలని అధికారులకు మంత్రి వివరించారు. రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపీ, డెయిరీ డెవలంప్మెంట్ ఎండీ చంద్రశే ఖర్ రెడ్డి, పివి నర్సింహరావు వెటర్నరీ యూని వర్శిటీ వైస్ ఛాన్సలర్ డా.జ్ఞానప్రకాశ్, ఉన్నతా ధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *