– పౌరుల నుంచి సూచనలు కోరుతున్న ఈసీఐ
న్యూదిల్లీ, జనవరి 3ః ఈసీఐనెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని సబ్‌మిట్ అండ్ సజెషన్స్ ట్యాబ్ ద్వారా తమ సూచనలు తెలియజేయాలని దేశ ప్రజలను భారత ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోంది.. పౌరులు జనవరి 10 వరకు తమ సూచనలు పంపవచ్చన్నది. కొత్త ఈసీఐ నెట్ యాప్ ట్రయల్ వెర్షన్ ద్వారా ఓటర్లకు మెరుగైన సేవలు, పోలింగ్ శాతం ధోరణులు త్వరితగతిన అందుబాటులోకి రావడం, గతంలో కొన్ని వారాలు లేదా నెలలు పట్టే ఇండెక్స్ కార్డుల ప్రచురణను పోలింగ్ ముగిసిన 72 గంటల్లోనే చేయగలగడం వంటి ముఖ్యమైన సదుపాయాలు దీనిద్వారా లభిస్తాయి. ఈ యాప్‌ను ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో విజయవంతంగా, ప్రయోగాత్మకంగా ఈసీఐ ఉపయోగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈవోలు), జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), నియోజకవర్గ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌వో), పరిశీలకులు, ఫీల్డ్ అధికారులు అందించిన అభిప్రాయాల ఆధారంగా ఈ ప్లాట్‌ఫారాన్ని నిరంతరం మెరుగుపరుస్తున్నది. పౌరుల నుంచి వచ్చే సూచనలను పరిశీలించి యాప్‌ను వినియోగదారులకు మరింత అనుకూలంగా అప్‌డేట్ చేయనున్నది. ఈసీఐనెట్ ప్లాట్‌ఫారం ఈ నెలలో ఈసీఐ అధికారికంగా ప్రారంభించనున్నది.
ఈ యాప్ రూపకల్పన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి నాయకత్వంలో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటని ఈసీఐ తెలిపింది. ఈసీఐనెట్ యాప్ అనేది పౌరుల కోసం రూపొందించిన ఒకే ఏకీకృత యాప్. ఇది గతంలో విడివిడిగా ఉన్న సుమారు 40 ఎన్నికల సంబంధిత యాప్‌లు / వెబ్‌సైట్లను ఒకే ప్లాట్‌ఫారంలో కలిపింది. వీటిలో ఓటరు హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్ే), ఈవిజిల్, సక్షమ్, పోలింగ్ ట్రెండ్స్(ఓటర్ టర్నవుట్ యాప్), నో యువర్ క్యాండిడేట్(కేవైసీ) వంటి అప్లికేషన్లు ఉన్నాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఉపసంచాలకుడు పవన్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




