న్యూదిల్లీ, మార్చి 18: కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతోపాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. కేవలం ఆధార్‌తోనే పాన్ పొందాలనుకుంటే మాత్రం మార్చి 31వ తేదీయే తుది గడువు అని కేంద్రానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది. బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు అత్యంత కీలకమనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నూతన పాన్ కార్డు కోసం ఆధార్ కార్డు కాపీ ఇస్తే సరిపోయేది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి వాటిల్లో ఏదో ఒకటి జత చేయాల్సి ఉంటుంది. ఎప్రిల్ ఒకటి తర్వాత పాత పాన్ దరఖాస్తు ఫారాలను కూడా అనుమతించేది ఉండదని కామన్ సర్వీస్ సెంటర్ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తు ఫారాలు కూడా మారతాయని, కొత్తవి అందుబాటులోకి వస్తాయని కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది. అలాగే ఆన్‌లైన్‌లో కొత్త పాన్ కార్డు దరఖాస్తు కోసం వెబ్‌సైట్లను సందర్శించాలని పేర్కొంది.
——————————————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



