– మంత్రి దనసరి సీతక్క
– భూటారంలో జంపన్నవాగు కరకట్టకు శంకుస్థాపన
ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, భూటారం గ్రామ సమీపంలోని జంపన్న వాగు కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నుంచి నివారణ లభిస్తుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ఏటూరు నాగారం మండలం భూటారం గ్రామంలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా , శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి నీటిపారుదల , ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 500 మీటర్ల పొడవు తో రూ.195 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న జంపన్న వాగు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని , భూటారం గ్రామానికి సమీప జంపన్న వాగు నుంచి తరచూ వరద ముంపు ఉండేదని గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 1 కోటి 95 లక్షల రూపాయల నిధులతో 500 మీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణం చేపడుతున్నామన్నారు. అత్యంత పటిష్టంగా కరకట్ట నిర్మాణం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగపేట మండలంలో రూ.100 కోట్ల నిధులతో నూతన టెక్నాలజీ ఉపయోగించి కరకట్ట నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే యువకులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూటారం ప్రజల వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో భాగంగా గ్రామ సమీప జంపన్న వాగు వరద ఉధృతికి తగ్గట్టుగా కరకట్ట నిర్మాణం చేయాలని గ్రామస్తుల సూచనలు మేరకు 500మీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ఇంజినీరింగ్ శాఖ ఎస్సీ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





