– నెహ్రూ లేకపోతే దేశ పరిస్థితిని ఊహించలేం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రే వంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం క ట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు అన్నారు. రవీంద్ర భారతిలో విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పా టు చేసిన దివంగత ప్రధాని నెహ్రూ సైంటిఫిక్ టెంపర్ మెంట్ సెలబ్రేషన్స్ కార్య క్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. వైజ్ఞానిక అభివృద్ధికి ప్రయో గశాలగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యాబినెట్ సభ్యులంతా విద్యావంతులు తెలంగా ణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీప డేలా యావత్ క్యాబినెట్ కృషి చేస్తుంది అన్నారు. వైజ్ఞానికంగా ముందుచూపుతో సమాజాన్ని ముందుకు నడిపించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టకపోయి ఉండి ఉంటే భారతదేశంలో నేటి పరిస్థితిని
ఊహించుకోలేకపోయే వారం అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధాని కావడంతో కేవలం సైన్స్ మా త్రమే కాదు ప్రజాస్వామ్యంలోనూ ప్రపంచం తో పోటీ పడేందుకు కారణమైందన్నారు. 1947 అర్ధరాత్రి ఈ దేశానికి స్వాతంత్య్రం లభించింది తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవ త్సరం తర్వాత స్వాతంత్రం లభించిందన్నా రు. స్వాతంత్రం సాధించిన నాడు ఆహారం, విద్యా రంగాల్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నా యి, ఆనాడు భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. జవహర్లాల్ నెహ్రూ పంచ వర్ష ప్రణాళికలు రూపొందించి అందులో ఏ అంశంపై దృష్టి పెట్టాలి అనేది మేధావులతో చర్చించి ఖరారు చేశారని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై దృష్టి పెట్టి ఆ రెండిటినీ కలుపుతూ మిశ్రమ ఆర్థిక విధానాలు రూపొందించారు, ఈ దేశంలో సోషలిజం అనే ఆలోచనను విస్తృతం చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. సోషలిజం, ప్రజాస్వామ్యం అనే ఆలోచనలతో భారత రాజ్యాంగంలో మేళవించి ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. దూర దృష్టి లేకపోవడంతో మనతోపాటు స్వాతంత్రం పొందిన పక్క దేశంలో ప్రజాస్వామ్యం కూలిపోయిది అన్నారు. ఇంత పెద్ద దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.. ఎవరు మెజారిటీ సాధిస్తే వారికి ఓ మంచి వాతావరణంలో అధికార బదలాయింపు జరుగుతుంది.. అందుకు కారణం జవహర్లాల్ నెహ్రూ దార్శనికతతో కూడిన విధానాలే కారణం అన్నారు.
కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశాన్ని చిన్న దేశాలు ఆక్రమించాయి అంటే ఆయా దేశాలకు గన్ పౌడర్ ఉండడమే ప్రధాన కారణం అన్నారు. మన దేశానికి చెందిన వందలాదిమంది బాణాలు పట్టుకుని యుద్ధం చేసిన చిన్న దేశాల ముందు వారి గన్ పౌడర్ విజ్ఞానంతో మోకరిల్లాల్సి వచ్చింది అన్నారు. భారతదేశం బలంగా ఎదగాలి అంటే సైన్స్ రీసెర్చ్ జరగాలని హోమి బాబా, విక్రమ్ సారా బాయ్ వంటి ప్రముఖులను ఆహ్వానించి ఐఐటీలలో ప్రధాని నెహ్రూ స్థాపించి ముందుకు తీసుకు వెళ్లారని డిప్యూటీ సీఎం వివరించారు. సైన్స్, టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో హైదరాబాదును కేంద్రంగా ఎంచుకొని నెహ్రూ ఇందిరా గాంధీలు అనేక కేంద్ర సంస్థలను స్థాపించారని తెలిపారు. వారి నిర్ణయం ఫలితంగా హైదరాబాదులో ప్రధాన పరిశ్రమలకు అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయని వివరించారు. చిన్నారుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారిని దగ్గరకు చేర్చుకున్నారని తెలిపారు. %ఖస్త్రష%, సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని నెలకొల్పారు, అక్కడ రీసెర్చ్ లు జరుగుతున్నాయి కాబట్టే ప్రస్తుతం దేశ అవసరాలు తీరుతున్నాయి అన్నారు. 80వ దశకం ప్రారంభంలో తాను ఫోన్ చేసుకోవాలంటే అబిడ్స్ కు వచ్చి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి నిలబడే పరిస్థితి ఉండేది నేడు అరచేతి లో ఫోన్ ద్వారా ప్రపంచం తో కనెక్ట్ అవడానికి కారణం సాంకేతిక పరిజ్ఞానం అన్నారు. అపద వస్తె దీపాలు వెలిగించడం, చప్పుళ్ళు చేయండి అంటే ఈ దేశం ఎటో వెళ్లి పోయేది అన్నారు. మన బిడ్డలు ప్రపంచం తో పోటీ పడాలి అన్న ఆలోచనతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నాం అన్నారు. ఒక్కో పాఠశాల ను 25ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నాం, ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ఫ్యూచర్ సిటీ లో సింటిఫిక్ టెంపర్ ను కొనసాగించుకునేందుకు స్కిల్ యూనివర్సిటీ పనులు వేగంగా చేపట్టాం అన్నారు. హై స్కూల్స్, కళాశాలలో విజ్ఞాన ప్రదర్శనలు ప్రారంభించండి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సౌకర్యాలు అందిస్తాం అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ను డిప్యూటీ సీఎం కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




