పంటపొలాల్లో పులి జాడలు

– పెద్దపల్లి నుంచి యాదాద్రి భువనగిరి వరకు కదలికలు
– ఆందోళనలో రైతులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామాల సమీపంలో సంచరిస్తున్నది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు కనిపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని గుంపనపల్లి, చౌట్ పల్లి గ్రామాలకు చెందిన అడవులకు ఆనుకుని ఉన్న పంటపొలాల్లో పులి జాడలు కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ లోని టైగర్ రిజర్వ్ లో 36 పులులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోనూ పులులు ఉన్నాయి. అయితే గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన నిర్వహించారు. ఈ సర్వేలో పులులతోపాటు ఇతర మాంసాహార జంతువుల ఉనికికి సంబంధించి 994 ఆధారాలు లభించాయి. ఈ సర్వే రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. సర్వే పరిశీ లించిన తర్వాత తెలంగాణలో పులుల సంఖ్యను అధికారికంగా ప్రకటించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *