పశ్చిమాసియా ఘర్షణలు.. ముగ్గురు భారత నావికుల మృతి

న్యూదిల్లీ, మార్చి 3: పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారత దేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలకు సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. షిప్ ఆపరేటర్ల భద్రతను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది. తాజా నివేదికల ప్రకారం భారత పతాకం ఉన్న నౌకలను బంధించినట్లు ఎలాంటి సమాచారం లేదని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రక్షించిన సిబ్బందిని స్వదేశానికి రప్పించడానికి ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకుంటున్నదన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున పర్షియన్ గల్ఫ్ సవిÖపంలో చిక్కుకొన్న భారతీయ నావికులకు తక్షణ సాయం అందించడానికి, వారిని భారత్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యుద్ధం వల్ల ప్రభావితులైన భారత నావికులతో ఈ బృందంలోని అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతారన్నారు. నావికుల కుటుంబాలు, షిప్పింగ్ కంపెనీలు, ట్రేడ్ యూనియన్లు, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్లు, సంబంధిత పోర్ట్ అధికారులతోనూ ఈ బృందం సమన్వయం చేసుకుంటుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *