– తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్ నేత కెటిఆర్
-రైతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి
అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళనకరం
అన్నదాతల ఆత్మహత్యలు అత్యంత ఆందోళనకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంనాటి సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమన్నారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని మండిపడ్డారు. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్‌లో దేవ్ సోత్ సర్వేశ్, ఆదిలాబాద్‌లో జాదవ్ అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం కావడం, రేవంత్ సర్కారు మోసా, అబద్ధపు హామీల పేరిట చేసిన తీరని ద్రోహాన్ని అడుగడుగునా ఎత్తిచూపుతోందని అన్నారు. రుణ మాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు, పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో కాంగ్రెస్ పాలనలో అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని అన్నారు. రెండేళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినా ఈ సన్నాసి సర్కారుకు ఇప్పటికీ సోయి రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణమృదంగానికి రేవంత్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలారా.. దయచేసి ధైర్యం కోల్పోకండి. మరో మూడేళ్లు ఓపిక పట్టండని సూచించారు. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని, రైతు ద్రోహి రేవంత్ ను గ్దదెదించుదామని.. వ్యవసాయరంగానికి మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





