బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపులు
మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్
ఎంపీ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కు పీపుల్స్‌వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వొచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని, సోమవారం సాయంత్రంలోగా రఘునందన్‌రావును చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. బెదిరింపు కాల్‌పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఓ ఆగంతకుడు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఫోన్ కాల్‌ని రఘునందన్‌రావు పీఏ ఎత్తాడు. 912143352974 నంబర్ నుంచి కాల్ వొచ్చింది. దమ్ముంటే కాపాడుకోండి అంటూ రఘునందన్‌ని ఆగంతకుడు బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్‌రావుకి ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్‌కి, సంగారెడ్డి ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎక్కడ నుంచి ఈ కాల్ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ అగ్ర నేతలు ఎంపీ రఘునందన్‌రావుకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.




