సీఎంకు వేలవేల వందనాలు

– అడగ్గానే అభివృద్ధి పనులకు అనుమతులిచ్చారు
– భక్తుల విశ్వాసాలకనుగుణంగా అభివృద్ధి
– మరో వెయ్యేండ్లు ఆలయం నిలిచేలా అభివృద్ధి
– గుడి అభివృద్ధి భాగ్యం కలిగినందుకు జన్మ ధన్యమైంది
– మేడారం సమీక్షలో మంత్రి సీతక్క భావోద్వేగం

మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా వనదేవతలు సమ్మక్క సారలమ్మల ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేలవేల వందనాలు.. వన దేవతల గుడిని అభివృద్ధి చేసుకునే భాగ్యం దక్కినందుకు నా జన్మ ధన్యం అయ్యింది అంటూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గద్గద స్వరంతో ప్రకటించారు. జాతర ప్రాంగణం అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షకు ముందు జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లి అని నినదించారు.
మేడారం అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాలేదని విమర్శించారు. ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు స్వయంగా రేవంత్‌ రెడ్డి ఇక్కడికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల త్యాగాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికను సీఎం ఖరారు చేశారు.. అధికార హోదాలో మేడారం జాతరను నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఆ తల్లులకు మొక్కుకున్నా.. వారి దీవెనతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.. నాకు మంత్రిగా సేవ చేసే అవకాశం దక్కింది.. వెయ్యేళ్లపాటు మేడారం కీర్తి నిలిచిపోయేలా అభివృద్ధి చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేయాలనుకున్నా.. కానీ నేను అడగకముందే సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ముందుకు వచ్చి మేడారం గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.. అడగగానే అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చారు.. ఇంతకంటే గొప్ప అవకాశం, అదృష్టం మరొకటి ఉండదు.. అని సీతక్క చెప్పారు. సమ్మక్క సారలమ్మ గుడి బాగుంటే ప్రజలంతా బాగుంటారు.. వన దేవతల దీవెన సకల జనుల మీద ఉంటుంది.. అదే సంకల్పంతో రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఇక్కడినుంచి పాదయాత్ర మొదలుపెట్టారు.. తల్లుల దీవెనలతో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క`సారలమ్మ ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడికి రావడం ఆదివాసీ ప్రజల అదృష్టం.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఇక్కడి ప్రజలంతా సహకరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వెయ్యేండ్లు తల్లుల కీర్తి, భక్తుల విశ్వాసాలు వర్థిల్లేలా మేడారం అభివృద్ధి ఉంటుందని, గద్దెల మూల స్వరూపం మార్చకుండా, తల్లుల పూజారులతో చర్చించి వారి ఆమోదంతో పనులు జరుగుతాయని అని మంత్రి సీతక్క మరోమారు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *