భద్రాచలం అభివృద్ధికి ఆ ఐదూళ్లే ముఖ్యం

– మౌనంగా ఐదు మండలాలను కలుపుకున్న బాబు
– మంత్రి తుమ్మల లేఖతో మరోమారు తెరపైకి సమస్య

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్6: భద్రాచ లం అభివృద్ధికి, నీటి మునక గండం నుంచి బయటపడడానికి ఇప్పుడు ఐదూళ్లు అవస రం గతంలో విభజన తరువాత ఏకపక్ష నిర్ణ యంతో ఐదు మండలాలను ఎపిలో కలి పారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 గ్రా మాలను ఏపీ నుంచి వేరుచేసి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. గత కొన్నేళ్లుగా ఈ విషయంలో కేంద్రం నా న్చివేత ధోరణి అవలంబిస్తోంది. ఎపి ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉంది. ఐదు మండలాలను కలపడం వల్లనే పోలవరం సాధ్యం అయ్యిందని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ విషయంలో పట్టువిడుపులు ప్రకటించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తనకు ముఖ్యమని ప్రకటించిన చంద్రబాబు ఈ విషయంలో మాత్రం పెదవి విప్పడం లేదు. చంద్రబాబు తలచకుంటే ఈ సమస్య చిటికెలో పరిష్కారం అవుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేసి గిరిజనుల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు పరిపాలనపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పదేపదే కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆ ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో 19 రెవెన్యూ గ్రామాలు ఉండగా తెలంగాణలోని రెండు భాగాల మధ్య ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయి. మిగిలిన సరిహద్దులు గోదావరి నది. రిజర్వు ఫారెస్టు ప్రాంతాలతో చుట్టుముట్టు ఉన్నాయి. దీంతో పరిపాలనపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామ పంచాయతీలకు పోలవరం ముంపు సమస్యతో ఎలాంటి సంబంధం లేదు. కానీ పరిపాలన, జీవనోపాధి, ప్రజాసేవల కోసం ఆ గ్రామాల ప్రజలు భద్రాచలంపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నారు. ఏపీలో కొనసాగటం వల్ల గత 12 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాల్లోని గిరిజనులు తమ ఊళ్లను తెలంగాణలోనే కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నా, కేంద్రం కానీ, ఎపి కానీ పట్టించుకోవడం లేదు. ఇక, ఆ గ్రామాల ప్రజలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 282 కిల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకోసం 8 గంటల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. మరోపక్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రం కేవలం 40 కిల దూరంలో ఉన్నదని, గంటలో జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. ప్రస్తుత సరిహద్దుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, అవసరమైన సరుకులు తరలిం చేటప్పుడు తరుచుగా తనిఖీలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతం ఛత్తీస్ గఢ్- ఒడిసా రాష్ట్రాలకు సపంలో ఉండటంతో పోలీసింగ్, శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం తెలంగాణలో ఉండగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని భూములు పురుషోత్తపట్నం ప్రాంతంలో ఉన్నాయి. ఈ భూముల విషయంలో గతంలో అక్కడికి వెళ్లిన మహిళా ఇవోపై దాడి జరిగింది. దేవాలయ నిర్వహణ సులభంగా ఉండేందుకు ఈ భూభాగాలను తిరిగి తెలంగాణలో కలపటం అత్యవసరం కూడా. ఈ నేపథ్యంలోనే ఆ ఐదు గ్రామ పంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు తిరిగి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి కలపాల్సిన అసవరం ఉఎంతైనా ఉందని. కేంద్ర మంత్రి అమిల్షాకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి జరగబో తతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన ఓ లేఖ రాశా రు. సమస్యను ముఖ్యమంత్రి ఇదివరకే ఏపీ సీఎం చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లారని ఆ లేఖలో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *