అతని వెన్నెముక, అతని గుండె, క్లోమం — ఒక్కొక్కటిగా, అతని అవయవాలన్నీ బలహీనపడ్డాయి, జైలులో వైద్యం లేకపోవడంతో, పేరుమోసిన అండ సెల్‌లో ఉంచారు. నిరంతర నొప్పి, తరచుగా మూర్ఛపోవడం, మూత్ర సమస్యలు, ఇవన్నీ అతని జీవితంలో భాగమై చివరికి అతన్ని భౌతికంగా లేకుండా చేశాయి. అతని విషాద మరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి నేర న్యాయ వ్యవస్థ అందించే కఠినమైన సవాళ్లను బహిర్గతం చేస్తుంది. మానవ హక్కుల కోసం ఉద్యమించిన ఒక తెలివైన విద్యావేత్త, సామాజిక క్రియాశీలత కలిగిన మేధావిని ఈ వ్యవస్థ తీవ్ర అసంతృప్తికి గురి చేసింది . 1967లో పేరుమోసిన ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద మోసపూరిత ఆరోపణలకు పదేళ్ల క్రూరమైన ఖైదు అనుభవించాల్సి వచ్చింది. అతను ఒక్కసారి మాత్రమే కాదు రెండుసార్లు నిర్దోషిగా విడుదలైనప్పటికీ, అతని స్వేచ్ఛ స్వల్పకాలికం. బొంబాయి హైకోర్టు తర్వాత కేవలం ఏడు నెలల్లో తీరని శోకాన్ని మిగిల్చి ఎన్నో ప్రశ్నలను నపుంసక సమాజానికి వేసి మౌనంగా నిష్క్రమించిన ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబా సుదీర్ఘకాలంగా రాజ్య అణచివేత తర్వాత పొందిన స్వాతంత్య్రాన్ని ఆయన ఆస్వాదించలేకపోయారు. బొంబాయి హైకోర్టు ఐదున్నరేళ్ల ఏకాంత నిర్బంధం తర్వాత జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది, ఆపై 24 గంటల తర్వాత, ఆ ఉత్తర్వును సుప్రీంకోర్టు స్టే విధించడం — స్వేచ్ఛను హరించడం మరింత కష్టం 90% వికలాంగ రాజకీయ ఖైదీ మరియు అతని సహ నిందితులు గత తొమ్మిదేళ్లుగా ఎదుర్కొన్న కనికరంలేని కోర్టు అతనిని జీవచ్ఛవంగా మార్చింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని గడ్చిరోలి జిల్లా కోర్టు 2017లో దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
అప్పటి నుండి అతను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఒంటరిగా నిర్బంధించబడ్డాడు. సాయిబాబా తన జీవితమంతా ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా ఉన్నారు. జీవితాంతం విద్యార్థులకు బోధించడానికి ఇష్టపడ్డారు. ఇది కాకుండా, నిరంతరం అత్యంత అణగారిన ప్రజలతో కొనసాగించాలనుకున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాల కోసం పని చేయాలని ఆల్ ఇండియా రెవల్యూషనరీ ఫోరమ్ లో క్రియాశీలక పాత్ర పోషించారు. వెనుకబడిన వర్గాలకు చైతన్యాన్ని పొందడానికి విద్య అవసరం. దాని కోసం, వారికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి-విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య ఉండాలి అనే సంకల్పంతో ముప్పై ఐదు సంవత్సరాలు బోధన తన ఆయుధంగా మలచుకున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరు చూస్తుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు దూరమవుతున్నట్లు కనిపిస్తుందని ఆందోళన చెందారు. సమాన విద్యావకాశాలు పూర్తిగా మృగ్యమై పోయాయని మదన పడ్డారు. దళిత ఆదివాసీ విద్యార్థులకు పేరెన్నిక గల సంస్థలు, ఉదారవాద విశ్వవిద్యాలయాలలో ప్రవేశం లేదు, ఒకవేళ వీరికి ప్రవేశం లభించినా వారు విశ్వవిద్యాలయాలలో నిరంతరం వివక్షకు గురవుతున్నారు. కార్పొరేట్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు ధనికుల కోసమే. దీంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
అతని విషాద మరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి నేర న్యాయ వ్యవస్థ అందించే కఠినమైన సవాళ్లను బహిర్గతం చేస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబా కవి, రచయిత మరియు నిష్ణాతుడైన ఉపాధ్యాయుడన్నారు. 90వ దశకంలో సాయిబాబా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో మండల్ కమిషన్ ఆందోళన ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫ్రంట్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు, రిజర్వేషన్లకు అనుకూలంగా క్యాంపస్‌లో భారీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం నుండి వచ్చిన ప్రొఫెసర్ సాయిబాబా ఎంఏ ఇంగ్లీష్ అభ్యసించడానికి సెంట్రల్ యూనివర్శిటీలో చేరారు తరువాత సిఫీల్ లో ఇఫ్లూ లో పోస్ట్ డాక్టరల్ స్టడీస్ పూర్తి చేశారు. సాయిబాబా జీవితాంతం చాలా ఉద్యమాలతో సంబంధం కలిగి ఉన్నారు. రిజర్వేషన్ అనుకూల ఉద్యమంలో, విద్యా పరిరక్షణ, అఖిల భారత రెవల్యూషనరీ ఫ్రాంట్ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు, మానవ హక్కుల సమస్యలపై సన్నిహితంగా పనిచేశారు.
ప్రొఫెసర్ సాయిబాబా సుదీర్ఘ అణచివేత తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు, తనకు లభించిన స్వేచ్ఛను అనుభవించలేక పోయారు. 1993లో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 35 రోజుల సుదీర్ఘ నిరాహారదీక్షలో సాయిబాబా భాగమయ్యారు. కర్కశ ప్రభుత్వం, మొత్తం వ్యవస్థ తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించింది. కడుపు నిండా దుఖం గుండెలనిండా ఆవేశం వున్నది కానీ నిస్సహాయులుగా వున్నాం. తీర్పులకు న్యాయానికి సంబంధం లేని దేశంలో, ఏ దిక్కు వెళ్ళాలో తెలిసినా బలహీనంగా ఉన్నాము. సాంస్కృతిక పక్షవాతంతో మెదళ్ళు చచ్చుబడిపోయి వున్నాం, పెద్దగా కదల్లేక పోతున్నాం, మెదల్లేక పోతున్నాం. గొంతు విప్పలేక పోతున్నాం. ఏమిటి ఘోరం? ఈ శిక్ష లేమిటి ? ఎన్ని ఉరితీతలకి సమానం అండా సెల్ లో చక్రాల కుర్చీతో ఏకాంత వాసం! ప్రాణాల్ని పీల్చే శీతల వాయువుల దాడిలో. ఇది గజదొంగలు పడ్డ దేశం, వాళ్ళందరి నుంచి నిన్నెలా రక్షించుకోవాలో నిన్నెలా మిగిలించుకోవాలో తెలియడం లేదు బాబా! ఇది నిస్సహాయుల ఆత్మఘోష.
-డా. ముచ్చుకోట. సురేష్ బాబు,
9989988912





