ఇది రైతు నామ సంవత్సరం

– రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
– శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌ ‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20:రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌ అం‌దిస్తున్నాం అన్నారు. దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణం అన్నారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే,అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం అన్నారు. రవీంద్రభారతిలో ఉగాది వేడుకలలో భాగంగా శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆవిష్కరించారు. 18 వేల కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు చేశాం.ఈ నెల 22 న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నాం. రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పట్టుపడుతోంది.ధరణి భూతాన్ని తరిమేసి భూ భారతితో భూసమస్యలను పరిష్కరిస్తున్నాం.దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా అన్నారు. రవీంద్రభారతిలో శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు జరిగాయి. తెలంగాణ భాషా సాంస్క•తిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఎం‌పీ వేం నరేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ‌చైర్మన్లు, అధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *