– రేపు చంద్రగ్రహణంతో ఆలయం మూసివేత
తిరుమల,సెప్టెంబర్ 6:తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వారాంతం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. 4 కి.మీ మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు. ఉచిత సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 7 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు 5 గంటల సమయం పట్టింది. ఇక శుక్రవారం తిరుమల శ్రీవారిని 69, 531 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,439 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వొచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం చందగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా 8వ తారీఖు 3 గంటల వరకు ఆలయాన్ని12గంటలపాటు మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. ఆదివారం శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో తీసుకున్న భక్తులను మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. ఆదివారం వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని, ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





