– 163 సర్పంచి, 1443 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు
మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కందుకూరు డివిజన్ లో మహేశ్వరం, కందుకూరు మండలాలు, ఇబ్రాహీంపట్నం డివిజన్ లో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల మొత్తం ఏడు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 63 సర్పంచ్, 1443 వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. గంట విరామం తర్వాత 2 గంటల నుంచి ఓట్లలెక్కింపు నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. ఇదే సందర్భంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ నీ ఎన్నుకోనున్నారు ఉదయం నుంచి మొదలయ్యే ఎన్నికల ప్రక్రియకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
పారదర్శకంగా విధులు నిర్వహించండి
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని మహేశ్వరం జోన్ అదనపు డీసీపీ సత్యనారాయణ అన్నారు. మూడో విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మంగళవారం మహేశ్వరం మోడల్ స్కూల్లో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ చిత్త శుద్ధితో విధులు నిర్వహించాలని కోరారు. విధులు పూర్తయ్యేవరకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమ పద్ధతిలో ఉండేలా ఓటర్లుకాని వ్యక్తులు సరిసరాల్లో కి రాకుండా జాగ్రత్త పడాలన్నారు. అనివార్యకారణాల వల్ల వాయిదాపడితే మరుసటి రోజు ఉపసర్పంచి ఎన్నిక ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు తహసీల్దార్లు, ఎంపీడీవోల ఆదేశాలతో పంచాయతీల్లో స్థానిక అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కాగాఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో వెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



