– బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5 : ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడు సభ నుంచి జారుకున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. బీఏసీలో అనేక ప్రశ్నలు లేవనెత్తి ఇప్పుడు అసలు కనిపించడమే లేదన్నారు. శాసన సభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం సరికాదన్నారు. అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే కృష్ణా జలాలపై సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిందన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే సభలో చెప్పాలి కానీ బయట చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌ను అగౌరవపరిచేలా వ్యవహరించిన బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభాపతికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





