సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి ప్రతీకలు

– ప్రజలకు రామచందర్‌రావు శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: తెలంగాణ ప్రజల, హిందువుల, ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలు త్యాగానికి, ధైర్యానికి నిలువెత్తు ప్రతీకలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కొనియాడారు. కొంగు బంగారమై కొలువైన మేడారం కోట్లాది భక్తుల నమ్మకానికి నిలయమన్నారు. సమ్మక్క సారలమ్మల దీవెనలతో తెలంగాణ ప్రజలు శాంతి, సుసంపన్నంగా జీవిస్తూ, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకుంటున్నాననన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శTభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల సన్నాహక సమావేశం

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచందర్ రావు అధ్యక్షతన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ దిశానిర్దేశం చేసింది. సమావేశంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్నికల ఇన్‌చార్జి అశీష్ షెలార్, రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ కో-ఇన్‌చార్జి అశోక్ పర్ణామి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *